logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తాడేపల్లిలో భారీ కారు తాకట్టు మోసం!* *నూజివీడుకు చెందిన బానోత్ భవాని, కనకమేడల భాస్కర్ అనే వ్యక్తులు ఉండవల్లికి చెందిన ఒక వ్యక్తి దగ్గర కారు అద్దెకు

*తాడేపల్లిలో భారీ కారు తాకట్టు మోసం!*

*నూజివీడుకు చెందిన బానోత్ భవాని, కనకమేడల భాస్కర్ అనే వ్యక్తులు ఉండవల్లికి చెందిన ఒక వ్యక్తి దగ్గర కారు అద్దెకు తీసుకున్నారు.*

*ఆ కారును గురజాలకు చెందిన వెంకట రమణయ్య వద్ద 3 లక్షలకు తాకట్టు పెట్టారు.*

*ఇదే తరహాలో నిందితులు సుమారు 7 కార్లను వెంకట రమణయ్య వద్ద తాకట్టు పెట్టినట్లు సమాచారం*

*కార్ల యజమానులు అడగడానికి వెళ్తే.. GPSలు పీకేసి, కార్లను గుర్తుతెలియని చోట దాచేశారు.*

*"నా డబ్బులు నాకు ఇస్తేనే కార్లు ఇస్తా" అంటూ వెంకట రమణయ్య బాధితులను బెదిరిస్తున్నట్లు సమాచారం.*

*నిందితులు భవాని, భాస్కర్‌లపై తాడేపల్లి పోలీస్ స్టేషన్‌లో FIR నమోదు.*

*పరారీలో ఉన్న నిందితుల కోసం పోలీసుల గాలింపు.*

12
374 views

Comment