logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బ్రహ్మంగారిమఠంలో కనుమ పోలేరమ్మ ఎదురుగా ముస్లిం హలాల్.. పీఠాధిపతి సాక్షిగా!

బ్రహ్మంగారిమఠంలో కనుమ పోలేరమ్మ ఎదురుగా ముస్లిం హలాల్.. పీఠాధిపతి సాక్షిగా.

​శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి వారు సజీవ సమాధి చెందిన పుణ్యక్షేత్రం కందిమల్లయ్యపల్లె (బ్రహ్మంగారిమఠం). స్వామివారి ఆజ్ఞ మేరకు అగ్నిని తీసుకువచ్చిన పరమ పవిత్రమైన కనుమ పోలేరమ్మ తల్లి దేవస్థానం అక్కడ కొలువై ఉంది. కానీ, నేడు ఆ క్షేత్రంలో జరుగుతున్న పరిణామాలు ప్రతి హిందువు సిగ్గుతో తలదించుకునేలా ఉన్నాయి.

​జరుగుతున్న దౌర్భాగ్యం ఏమిటంటే:
కనుమ పోలేరమ్మ తల్లి దేవాలయం ఎదురుగానే ఒక ముస్లిం వ్యక్తి జంతుబలులకు ‘హలాల్’ చేస్తున్నాడు. మన హిందూ ధర్మంపై అవగాహన లేని కొందరు నీతిమాలిన వ్యక్తులు, హిందువులమని చెప్పుకుంటూనే వారి చేత హలాల్ చేయించుకుంటున్నారు.

​మఠాధిపతి గారి మౌనం.. అధికారుల నిర్లక్ష్యం:
అక్కడ అత్యంత దౌర్భాగ్యకరమైన విషయం ఏమిటంటే.. బ్రహ్మంగారి మఠం తాత్కాలిక మఠాధిపతి అక్కడే ఉండి, ఆయన వాహనం అక్కడే ఉన్నా ఈ అరాచకం సాగుతోంది. పీఠాధిపతి హోదాలో ఉన్న వ్యక్తి కళ్ళముందే సనాతన ధర్మానికి విరుద్ధంగా హలాల్ జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించడం లేదు? కేవలం మఠాధిపతి మాత్రమే కాదు, అక్కడ బాధ్యత గల పదవుల్లో ఉండి, హిందూ ధర్మం గురించి మాట్లాడే ప్రతి ఒక్కరూ దీనిని అడ్డుకోవాల్సిన బాధ్యత ఉంది.

​పోలేరమ్మ గుడిలో దొంగతనం జరిగితేనే దిక్కు లేదు!
అవునులే.. పట్టపగలే పోలేరమ్మ గుడిలో దొంగతనం జరిగితే, ఆ దొంగతనం విజువల్స్ వీడియో రూపంలో బయటకు వచ్చి, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో మరియు సోషల్ మీడియాలో ప్రసారమైనా ఇప్పటికీ దాని మీద దిక్కు దివానా లేదు, అడిగే నాధుడే లేడు. కళ్ళముందే కనిపిస్తున్న దొంగతనంపైనే చర్యలు లేనప్పుడు, ఇలాంటి ధర్మ విరుద్ధ పనులను ఎవరు పట్టించుకుంటారు అనే ఆలోచన ప్రతి భక్తుడికి రాక మానదు.

దీనిని ప్రశ్నిస్తే కొందరు "సిద్ధయ్య గారు ముస్లిం కదా.. ఆయన్ని బ్రహ్మంగారు శిష్యుడిగా చేర్చుకోలేదా?" అని పనికిమాలిన తర్కాలు తీస్తారు. గుర్తుంచుకోండి.. సిద్ధయ్య గారు దూదేకుల కులంలో జన్మించినా, వీరబ్రహ్మేంద్రస్వామి వారిని పరిపూర్ణంగా నమ్మి, సనాతన ధర్మాన్ని స్వీకరించి అందులో భాగమయ్యారు. ఆయన మఠంలో ఉండి ఇస్లాం సంప్రదాయాలను పాటించలేదు. ఫకీర్ బాబా లాగా అల్లా మాలిక్ అల్లానే సర్వేశ్వరుడు అల్లానే యజమాని అనే మాటలు మాట్లాడలేదు!

​ప్రశ్నిస్తున్నాం.. సమాధానం ఉందా?
​హిందూ దేవాలయాల ముందు ఇస్లాం పద్ధతిలో హలాల్ చేయడం అంటే.. వారి అల్లాకు నైవేద్యంగా పెట్టిన దానిని (ఎంగిలిని) పోలేరమ్మ తల్లికి పెడతారా? పోలేరమ్మకు ఎంగిలి కూడు పెడతారా? మీకసలు బుద్ధి ఉందా?

​ఇదే విధంగా ముస్లింల మసీదుల దగ్గరో, దర్గాల దగ్గరో హిందూ సంప్రదాయాల ప్రకారం ఏదైనా కార్యక్రమం చేస్తే వారు ఊరుకుంటారా? మరి హిందువులకే ఈ దౌర్భాగ్యపు ఉదారత ఎందుకు?

​మా డిమాండ్ ఇదే:
ఇక్కడ జరుగుతున్న ఈ అనాచారాన్ని అరికట్టాల్సిన పూర్తి బాధ్యత మఠం నిర్వాహకులపై ఉంది. వెంటనే హలాల్‌ను నిషేధించి, కఠిన చర్యలు తీసుకోవాలి. లేని పక్షంలో హిందూ సంఘాల దృష్టికి తీసుకువెళ్లడంతో పాటు, ధర్మ రక్షణ కోసం కలెక్టర్ గారికి విన్నవించి చట్టపరమైన పోరాటం చేస్తాం.

​హిందూ ధర్మాన్ని కాపాడుకుందాం - అన్యమత ఆచారాలను దేవాలయాల్లో అడ్డుకుందాం.

1
0 views

Comment