logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

న్యూస్ రిపోర్ట్ న్యూ హిందూపూర్ లారీ డ్రైవర్ల ఆగ్రహం ఉవ్వెత్తున

న్యూస్ రిపోర్ట్ న్యూ హిందూపూర్ లారీ డ్రైవర్ల ఆగ్రహం ఉవ్వెత్తున

డ్రైవర్లను బానిసలుగా చూస్తున్న ఓనర్లపై న్యూ హిందూపూర్ లారీ డ్రైవర్ & క్లీనర్ అసోసియేషన్ తీవ్ర హెచ్చరిక

న్యూ హిందూపూర్లో లారీ డ్రైవర్లు, క్లీనర్లు ఎదుర్కొంటున్న సమస్యలు రోజురోజుకీ తీవ్రమవుతున్నాయని అసోసియేషన్ నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. డ్రైవర్లకు భారీ మొత్తాల్లో అడ్వాన్స్ ఇచ్చి, తరువాత అదే అడ్వాన్స్ పేరుతో వారిని బానిసల్లా పని చేయించడం జరుగుతోందని మండిపడ్డారు.

డ్రైవర్ పగలు రాత్రి కష్టపడి లారీ నడిపినా, జీతాలు నిలిపివేయడం, అవమానించడం, ఒత్తిడికి గురిచేయడం, అప్పు పేరుతో వేధించడం వంటి అమానుష ఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు. డ్రైవర్ లేకుండా లారీ ఒక్క అడుగు కూడా కదలదు కానీ డ్రైవర్ల కష్టానికి గౌరవం ఇవ్వడం లేదు అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ నేపథ్యంలో న్యూ హిందూపూర్ లారీ డ్రైవర్ & క్లీనర్ అసోసియేషన్ అత్యవసర సమావేశం నిర్వహించి కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై డ్రైవర్ అడ్వాన్స్ పరిమితి 30,000 మాత్రమే ఉండాలని, దానికంటే ఎక్కువ మొత్తాలతో డ్రైవర్లను అప్పుల ఊబిలోకి నెట్టకూడదని స్పష్టం చేసింది.

అసోసియేషన్ సభ్యులు ఆటోనగర్ పరిసర ప్రాంతాల్లో పాంప్లెట్లు పంపిణీ చేసి, ఓనర్ అసోసియేషన్కు వినతిపత్రం అందజేశారు. తమ డిమాండ్లపై వెంటనే స్పందించి న్యాయం చేయాలని, లేకపోతే భారీ ధర్నాలు, ఆందోళనలు, లారీ బంద్ కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.

డ్రైవర్ కష్టం చిన్నది కాదు మా హక్కుల కోసం చివరి వరకు పోరాటం చేస్తాం
డ్రైవర్ల ఐక్యతే మా బలం

న్యూ హిందూపూర్ లారీ డ్రైవర్ & క్లీనర్ అసోసియేషన్

48
784 views

Comment