చిన్నాపూర్ లో రైతుల ధర్నా
- అధిక తూకం పై మండి పడ్డ రైతులు
-ఎర్రని ఎండను కూడా లెక్క చేయని అన్నదాతలు
చిన్నాపూర్ లో రైతుల ధర్నా
- అధిక తూకం పై మండి పడ్డ రైతులు
-ఎర్రని ఎండను కూడా లెక్క చేయని అన్నదాతలు
- చుక్క గంగారెడ్డి - 2026 మే23:
జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం చిన్నాపూర్ గ్రామ రైతులు శనివారం జాతీయ రహదారి పై ధర్నా నిర్వహించారు.
భగ - భగ మండుతున్న ఎర్రని ఎండను కూడా లెక్క చేయకుండా ఈ అన్నదాతలు జాతీయ రహదారిపై బైఠాయించి వారి నిరసనను వ్యక్తం చేశారు. వరిధాన్యము కొనుగోలు కేంద్రంలో సంచికి 3 కిలోల చొప్పున క్వింటాల్ కి 7.5 కిలోలు దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. హామాలీలు లేరు అనే సాకుతో వడ్ల ను తరలించడంలో అధికారులు జాప్యం చేస్తూ కాలక్షేపం చేస్తున్నారని ఆరోపించారు.
రైస్ మిల్లర్ల పేరుతో అధిక తూకం వేసి దోచు కుంటున్నారని ఆరోపించారు.
చిన్నాపూర్ గ్రామానికి చెందిన రైతులు అధిక సంఖ్యలో పాల్గొని జాతీయ రహదారిని దిగ్బంధం చేసి వాహనాల రాకపోకలను నిలిపి వేశారు. సమాచారం అందుకున్న బుగ్గారం, ధర్మపురి పోలీసులు హుటా హుటిన తరలి వచ్చి రైతులను సముదాయించి ధర్నా నుండి విరమింప జేశారు.