వైసీపీ నాయకురాలి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రసన్నకుమార్ రెడ్డి
కొడవలూరు మండలం, నార్త్ రాజుపాలెం గ్రామానికి చెందిన వైసీపీ నాయకులు నెలవాయి మాణిక్యం గారి సోదరి శ్రీమతి నెలవాయి లతా మేరి గారు ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో, నేడు నార్త్ రాజుపాలెం గ్రామంలోని వారి స్వగృహానికి వెళ్లి స్వర్గీయ శ్రీమతి నెలవాయి లతా మేరి గారి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన మాజీ మంత్రివర్యులు, వైసీపీ రాష్ట్ర PAC సభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి గారు.
ఈ కార్యక్రమంలో వైసీపీ రాష్ట్ర కార్యదర్శి, సర్వేపల్లి నియోజకవర్గ పరిశీలకులు వీరి చలపతిరావు గారు పాల్గొన్నారు.
అలాగే వైసీపీ నాయకులు చిమాట శేషగిరి గారు, అడపాల మోహన్ కృష్ణ గారు, MD కరీముల్లా గారు, గాలి సునీల్ గారు, జనార్దన్ రెడ్డి గారు, అనిల్ రెడ్డి గారు, అనపల్లి భాస్కర్ గారు, రహంతుల్లా గారు, సురేష్ గారు, మల్లికార్జున గారు, గోపీ గారు తదితరులు పాల్గొన్నారు.