logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కడప, మే 25: భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో కడప జాయింట్ కలెక్టర్ను ఈరోజు కలిసి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ (RTE Act) అమలుపై వినతి పత్రం సమర్పించారు.

కడప, మే 25: భారత చైతన్య యువజన పార్టీ ఆధ్వర్యంలో కడప జాయింట్ కలెక్టర్‌ను ఈరోజు కలిసి రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ (RTE Act) అమలుపై వినతి పత్రం సమర్పించారు. విద్య ప్రతి చిన్నారి హక్కు అని పేర్కొంటూ విద్యా రంగంలో ఉన్న పలు సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు.

ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కొరత, పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడంలో ఉన్న ఇబ్బందులను పరిష్కరించాలని పార్టీ నాయకులు కోరారు. అలాగే RTE చట్టాన్ని సమర్థవంతంగా అమలు చేసి ప్రతి విద్యార్థికి సమాన విద్యా అవకాశాలు కల్పించాలని జాయింట్ కలెక్టర్‌ను విజ్ఞప్తి చేశారు.

ఈ కార్యక్రమంలో భారత చైతన్య యువజన పార్టీ కడప జిల్లా యూత్ కన్వినర్ కట్ల వెంకట నాగార్జున, పులివెందుల నియోజకవర్గ కన్వినర్ సురే నిర్మల యాదవ్, మల్లేష్ యాదవ్, నాగ సుబ్బయ్య యాదవ్, పెద్దన్న యాదవ్, సుబ్బనరసింహులు, గంగాధర్ యాదవ్, జనార్దన్, పెంచలయ్య తదితరులు పాల్గొన్నారు.

28
1199 views

Comment