logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రోలుగుంట: పి.ఎం. శ్రీ పాఠశాలలో అడ్మిషన్ల కోసం డోర్ టు డోర్ ప్రచారం

రోలుగుంట: పి.ఎం. శ్రీ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థుల అడ్మిషన్ల పెంపు కోసం ప్రధానోపాధ్యాయులు టీ.వి. శేషగిరిరావు మరియు ఆంగ్ల ఉపాధ్యాయిని పి.వి.ఎం. నాగజ్యోతి గ్రామంలో డోర్ టు డోర్ ప్రచారం నిర్వహించారు. విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలకు వెళ్తున్న ఇళ్లకు వెళ్లి, ప్రభుత్వం అందించే నాణ్యమైన విద్య, ఆధునిక సౌకర్యాలు, ఉచిత పథకాల గురించి తల్లిదండ్రులకు వివరించారు.

ప్రచారంలో పాఠశాలలో ఉన్న డిజిటల్ తరగతి గదులు, ఐఎఫ్పీ (IFP) ప్యానెల్స్, ల్యాబ్ సౌకర్యాలు, క్రీడలు, సహపాఠ్య కార్యక్రమాలు మరియు విద్యార్థుల ఉత్తమ ఫలితాల గురించి వివరించారు. అలాగే ప్రభుత్వ పాఠశాలలో అందించబడుతున్న ఉచిత యూనిఫారాలు, పుస్తకాలు, మధ్యాహ్న భోజనం, ట్యాబ్స్ తదితర పథకాల వివరాలను తల్లిదండ్రులకు తెలియజేసి, వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించాలని కోరారు. టీ.వి. శేషగిరిరావు ఈ ప్రచారం వల్ల అడ్మిషన్ల సంఖ్య పెరగాలని ఆశాభావం వ్యక్తం చేశారు.

34
862 views

Comment