logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

బుగ్గారం మండల ప్రజలకు గుడ్ న్యూస్ - ఎక్స్ రోడ్డు వద్ద ఆగుతున్న ఎక్స్ ప్రెస్ బస్ - బుగ్గారం ఎక్స్ రోడ్డు పేరుతోనే "ఆర్టీసీ ఎక్స్ ప్రెస్" బస్ టికెట్

బుగ్గారం మండల ప్రజలకు గుడ్ న్యూస్

- ఎక్స్ రోడ్డు వద్ద ఆగుతున్న ఎక్స్ ప్రెస్ బస్

- బుగ్గారం ఎక్స్ రోడ్డు పేరుతోనే "ఆర్టీసీ ఎక్స్ ప్రెస్" బస్ టికెట్

- బుగ్గారం / జగిత్యాల జిల్లా:

జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలోని ఎక్స్ రోడ్డు వద్ద తెలంగాణ ఆర్టీసీ ఎక్స్ ప్రెస్ బస్సు ఆగుతుందని ప్రముఖ ఉద్యమ నాయకుడు, సామాజిక కార్యకర్త, తెలంగాణ జనసమితి జగిత్యాల జిల్లా అధ్యక్షులు చుక్క గంగారెడ్డి తెలిపారు. మన "బుగ్గారం ఎక్స్ రోడ్డు" పేరుతోనే ఆర్టిసి బస్ టికెట్ కూడా జారీ చేస్తున్నారని ఆయన సూచించారు.
ఆదివారం ఉదయం: 7-44 గంటలకు ఆయన స్వయంగా బుగ్గారం ఎక్స్ రోడ్డు వద్ద సిరిసిల్ల డిపో కు చెందిన టి.జి. 02 టి. 4015 నంబర్ గల తెలంగాణ ఆర్టీసీ బస్సు ఆపుకొని మంచిర్యాల వరకు ప్రయాణం చేసినట్లు వివరించారు.
ఉదయం : 7-44 బుగ్గారం ఎక్స్ రోడ్డు వద్ద ఆర్టీసీ బస్ ప్రయాణం మొదలై 9-03 గంటలకు కేవలం 1-16 ఒక గంట 16 నిమిషాలలో మంచిర్యాల చేరుకోవడం జరిగిందన్నారు.
సిరిసిల్ల డిపో నుండి మంచిర్యాల - బెల్లంపల్లి వరకు వెళ్తున్న ఈ ఆర్టీసీ బస్ డ్రైవర్ - కండక్టర్ లకు ఆయన ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.
ఈ ఎక్స్ ప్రెస్ బస్ ద్వారా ప్రారంభం అయిన తన ప్రయాణం మంచిర్యాల నుండి రైలు ద్వారా కేరళ రాష్ట్రంలోని పలక్కడ్ వరకు కొనసాగిందని చుక్క గంగారెడ్డి పేర్కొన్నారు.
బుగ్గారం మండల ప్రజలతో పాటు దేశ పౌరులంతా మన బుగ్గారం ఎక్స్ రోడ్డు వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఆర్టీసీ లోని ఎక్స్ ప్రెస్ బస్ సేవలు కూడా వినియోగించుకోవాలని ఆయన కోరారు. ఒకవేళ ఎప్పుడైనా, ఏదైనా ఎక్స్ ప్రెస్ బస్ బుగ్గారం ఎక్స్ రోడ్డు వద్ద ఆగక పోతే వెంటనే ఆ బస్ నంబర్ వచ్చేలా ఫోటో లేదా వీడియో తీసి తన 9441440843 వాట్సాప్ నంబర్ కు పంపించి వివరాలు తెలియ పర్చాలని సూచించారు. ఇలాంటి ఫోటోలు, వీడియో కు ఆర్టీసీ ఉన్నతాధికారులకు చూపించి తగు చర్యలు తీసుకునేలా తన వంతు కృషి చేస్తానని చుక్క గంగారెడ్డి ప్రకటించారు.

1
121 views

Comment