చిత్తూరు: రెడ్ క్రాస్ జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం, నూతన కార్యవర్గ ఎన్నికలు
చిత్తూరు: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చిత్తూరు జిల్లా శాఖ సర్వసభ్య సమావేశం 25-05-2026న జిల్లా కలెక్టర్ కార్యాలయం వివేకానంద భవనం రెండవ అంతస్తులో నిర్వహించబడింది. ఈ సమావేశంలో ప్రధాన కార్యదర్శి సహదేవ నాయుడు, కోశాధికారి తేజో మూర్తి, మాజీ చైర్మన్ రమేష్ బాబు గారు గత మూడు సంవత్సరాలలో జరిగిన కార్యక్రమాల నివేదికలను సభ్యులకు సమర్పించారు మరియు ఆమోదం పొందారు.
తర్వాత, నూతన కార్యవర్గ ఎన్నికలు జరిగింది. జిల్లాకలెక్టర్ సుమిత్ కుమార్ గారు నియామకాలు చేసిన సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కోఆర్డినేటర్ మద్దిపట్ల వెంకటరమణ ఎన్నికల అధికారిగా, రాష్ట్ర రెడ్ క్రాస్ వైస్ చైర్మన్ రామచంద్ర రాజు ఎన్నికల పరిశీలకులుగా హాజరయ్యారు. 11 మంది సభ్యులను జిల్లా రెడ్ క్రాస్ మేనేజ్మెంట్ కమిటీకి ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డాక్టర్ ఎం తేజోమూర్తిని చైర్మెన్, కె. గోవర్ధన్ బాబిని వైస్ చైర్మన్, ఆర్. రాజగోపాల్ నాయుడు గారిని కోశాధికారిగా ఎన్నుకున్నారు.
ఈ ఎన్నికల కార్యక్రమంలో దాదాపు 300 మంది జీవితకాల సభ్యులు పాల్గొన్నారు. సమావేశం విజయవంతం కావడంలో జిల్లా శాఖ సిబ్బంది మరియు స్వచ్ఛంద సేవకుల సహకారం అందింది. కొత్త కార్యవర్గం సేవా దృక్పథంతో రెడ్ క్రాస్ అభివృద్ధికి కృషి చేస్తుందని ప్రకటించారు.