కార్వేటినగరం పోలీసులు 24 గంటల్లో బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు
కార్వేటినగరం మండల పరిధిలోని RKVB పేటకు చెందిన వాసుదేవ రెడ్డి ప్రయాణ సమయంలో రూ.9 లక్షల విలువైన బంగారు ఆభరణాలను పోగొట్టుకున్నట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కార్వేటినగరం ఎస్.ఐ తేజస్విని మరియు జిల్లా ఎస్పీ తుషార్ డూడి, IPS ఆదేశాల మేరకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి సీసీటీవీ ఫుటేజ్ మరియు సాంకేతిక ఆధారాలతో 24 గంటల్లోనే ఆభరణాలను గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఆభరణాలను పోలీస్ స్టేషన్ లో బాధితుడికి అప్పగించారు.
ఈ ఘటనపై బాధిత కుటుంబ సభ్యులు పోలీసులు సేవలను అభినందించారు. ఎస్.ఐ తేజస్విని మాట్లాడుతూ ప్రజల ఆస్తి రక్షణలో చిత్తూరు జిల్లా పోలీసులు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటారని తెలిపారు.