logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

కొత్తూరు సుబ్బరాయుని సన్నిధిలో ఆర్టీవో ఏవో సునీత ప్రత్యేక పూజలు.

పాణ్యం (AIMA MEDIA): ప్రముఖ శైవక్షేత్రం పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవస్థానం నందు నంద్యాల ఆర్టీవో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ కే. సునీత కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో యం.రామక్రిష్ణ, అర్చకులు కంపమల్ల నారాయణస్వామి వారికి అభిషేకములు, అర్చనలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం ఆశీర్వ మంటపము నందు ఏవో కే.సునీత కుటుంబ సభ్యులకు పూలమాలతో, శాలువాలతో ఘనంగా సత్కరించి స్వామివారి చిత్రపటం, ప్రసాదం అందజేసి, వేద ఆశీర్వచనం చేశారు. ఈ కార్యక్రమంలో అర్చకులు, సిబ్బంది సుబ్బారెడ్డి, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

5
251 views

Comment