logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

తెలంగాణ ఐటీ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు 57వ జన్మదిన వేడుకలు

జయశంకర్ భూపాలపల్లి జిల్లా: తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గౌరవనీయులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారి 57వ జన్మదినోత్సవ వేడుకలు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బట్టు కరుణాకర్ గారు మరియు NSUI ప్రధాన కార్యదర్శి మట్టెవాడ సురేష్ గారి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమంలో కేక్ కట్ చేసి శ్రీధర్ బాబు గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడంతో పాటు ప్రజాసేవలో మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు మరియు అభిమానులు పాల్గొని ఆయనకు ఆయురారోగ్యాలు, సుఖసంతోషాలు మరియు దీర్ఘాయుష్షు కలగాలని కోరుతూ శుభాకాంక్షలు తెలిపారు.

17
574 views

Comment