logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

రహదారి వీరుల పథకంపై కలెక్టర్ సమీక్ష:


తేది:30.05.2026
కామారెడ్డి జిల్లా
శనివారం

‘రహదారి వీరుల’ పథకంపై కలెక్టర్ సమీక్ష:

ప్రమాద బాధితులను కాపాడితే రూ. 25,000 బహుమతి*

రహదారి ప్రమాద బాధితులను సకాలంలో ఆసుపత్రికి చేర్చి ప్రాణాలు కాపాడేందుకు ఉద్దేశించిన ‘రహదారి వీరుల’ (రహవిర్) పథకాన్ని జిల్లాలో విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.
శనివారం కలెక్టరేట్ లోని మినీ కాన్ఫరెన్స్ హాలులో ఈ పథకం అమలు తీరు పై ఉన్నతాధికారులతో కలిసి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. రహదారి ప్రమాదం జరిగిన వెంటనే జిల్లా ప్రజలు తక్షణమే స్పందించి బాధితులకు సాయం చేయాలని, ప్రతి ఒక్కరూ 'రహదారి వీరులు'గా మారాలని పిలుపునిచ్చారు.

ప్రమాదంలో ఉన్నవారిని సకాలంలో కాపాడిన వారికి ప్రభుత్వం తరఫున రూ. 25,000 నగదు బహుమతి అందజేస్తామని ప్రకటించారు.

జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటుఈ పథకాన్ని పారదర్శకంగా పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో 'డిస్ట్రిక్ట్ అప్రిసియేషన్ కమిటీ' (District Appreciation Committee) ని ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ తెలిపారు.

ఈ కమిటీకి జిల్లా కలెక్టర్ అధ్యక్షుడిగా వ్యవహరిస్తుండగా, సభ్యులుగా జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ (SP), జిల్లా రవాణా అధికారి (DTO), జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (DMHO) బాధ్యతలు నిర్వర్తిస్తారని ఆయన వెల్లడించారు.
రోడ్డు ప్రమాదాల నివారణకు, బాధితులకు తక్షణ వైద్యం అందేలా చూసేందుకు ప్రజలు, అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు.

22
1275 views

Comment