logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఎసిబి వలలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో - ఓ కేసులో 9 లక్షలు లంచం డిమాండ్.. - ఐదు లక్షలు తీసుకొని, మరో నాలుగు లక్షలకు వేదింపులు

ఎసిబి వలలో సైబర్ సెక్యూరిటీ బ్యూరో

- ఓ కేసులో 9 లక్షలు లంచం డిమాండ్..

- ఐదు లక్షలు తీసుకొని, మరో నాలుగు లక్షలకు వేదింపులు

- (చుక్క గంగారెడ్డి, సీనియర్ జర్నలిస్ట్ ) - 2026 మే 30 :

ఏసీబీ వలలో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్‌స్పెక్టర్ చిక్కారు. లంచం కేసులో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఇన్‌స్పెక్టర్ బత్తుల మహేందర్ శనివారం అరెస్ట్ అయ్యారు.

ఎసిబి సెంట్రల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ డీఎస్పీ కథనం ప్రకారం పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. సైబర్ మోసం కేసులో కుటుంబ సభ్యులను ఇరికించబోమని ఆయన రూ.9 లక్షలు లంచం డిమాండ్ చేశారు. బాధితుడి నుండి వారి బంధువుల నుండి మొత్తం ఇప్పటికే రూ.5 లక్షలు నగదు లంచం గా తీసుకున్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. మిగిలిన రూ.4 లక్షల కోసం మరోసారి డిమాండ్ చేస్తూ బెదిరింపులకు దిగడంతో బాధితులు ఎసిబి అధికారులను ఆశ్రయించారు. వారి పిర్యాదు మేరకు సైబర్ సెక్యూరిటీ ఇన్‌స్పెక్టర్ ను పట్టుకునేందుకు ఎసిబి అధికారులు రంగంలోకి దిగారు. ఎసిబి అధికారులను గమనించి పారిపోతుండగా వెంబడించి ఆయనను ఏసిబి అధికారులు పట్టుకున్నారు. అధికార నివాసంలో సోదాలు నిర్వహించారు. లెక్కల్లో చూపని రూ.13 లక్షల నగదు, బంగారు ఆభరణాలు, ఆస్తి పత్రాలు కూడా స్వాధీనం చేసుకున్నారు. అక్రమ ఆస్తులపై మరింత లోతైన విచారణ కొనసాగిస్తున్నారు. నిందితుడిని నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరు పరుచనున్నట్లు
ఏసిబి అధికారులు తెలిపారు.

0
0 views

Comment