ప్రజా సేవలో ప్రముఖులు
ఇంటింటికీ వెళ్ళి ఆధార్ అతెంటికేషన్
ప్రముఖుల సూచన మేరకు
సేవలందించిన పంచాయతీ కార్యదర్శి
ప్రజా సేవలో ప్రముఖులు
ఇంటింటికీ వెళ్ళి ఆధార్ అతెంటికేషన్
ప్రముఖుల సూచన మేరకు
సేవలందించిన పంచాయతీ కార్యదర్శి
బుగ్గారం / జగిత్యాల జిల్లా:
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో ప్రభుత్వం ద్వారా పింఛన్ పొందుతూ ఆధార్ అతెంటికేషన్ కోసం రాలేని స్థితిలో ఉన్న దివ్యాంగులను, వృద్ధులను పలువురు ప్రముఖులు గుర్తించారు. వారి అతెంటికేషన్ సకాలంలో కాకపోతే ఇబ్బందులు ఎదురవుతాయని గ్రహించారు.
గ్రామ ప్రముఖులు నక్క రాజయ్య, చుక్క గంగారెడ్డి, జంగ శ్రీనివాస్, పోగుల తిరుపతి లతో పాటు వార్డ్ సభ్యులు బెజ్జారపు రాజు, దూడ పోచరాజు తదితరులు గ్రామంలో ఉన్న దివ్యాంగులను, కురువృద్ధులను ప్రత్యేకంగా గుర్తించారు.
బుగ్గారం గ్రామ పంచాయతీ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లి ఇంటింటికీ వెళ్ళి వాళ్లందరికీ ఆధార్ అతెంటికేషన్ చేయాల్సిందిగా కోరారు. ప్రముఖుల కోరిక మేరకు గ్రామ పంచాయతీ కార్యదర్శి అక్బర్ తన విధి నిర్వహణ బాధ్యతలను సక్రమంగా చేపడుతూనే వారి సూచనల మేరకు ప్రజల వద్దకే వెళ్లి సేవలు అందించారు.
వీధుల్లో తిరుగుతూ గ్రామ పంచాయతీ వరకు రాలేని స్థితిలో ఉన్న దివ్యాంగులను, కురు వృద్ధులను గుర్తించి వారికి ఆధార్ అతెంటికేషన్ ఫోటోలు, వేలిముద్రలు తీసుకొని వాటి ద్వారా పింఛన్ దారుల లైఫ్ సర్టిఫికెట్ ధృవీకరణ ప్రక్రియను పంచాయతీ కార్యదర్శి అక్బర్ తో పూర్తి చేయించారు. అలాగే ఆయా ప్రాంతాలలో గల మామూలు పెన్షన్ దారులకు కూడా ఆధార్ అతెంటికేషన్ సేవలు అందింప జేశారు.
భగ - భగ మండుతున్న ఎండలను కూడా లెక్క చేయకుండా శనివారం మిట్ట మధ్యాహ్నం వారు ఇంటింటికి తిరిగి సేవలు అందించడం పట్ల బుగ్గారం ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. వారి సేవలను కొనియాడుతూ అభినందనలు కూడా తెలియజేస్తున్నారు. వీరితో పాటు సిబ్బంది దూడ కిరణ్ తదితరులు పాల్గొన్నారు.