logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

అమరావతి అర్బన్ మొబిలిటీపై సీఎం చంద్రబాబు కీలక సమావేశం

అమరావతి( AIMA MEDIA ): ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన 61వ సీఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో అమరావతి నగర అర్బన్ మొబిలిటీ ప్లానింగ్ పై చర్చలు జరిపారు. భవిష్యత్ ప్రణాళికలపై సమగ్రంగా చర్చించి, మొత్తం 18 ప్రతిపాదనలకు ఆమోదం తెలిపింది.

హైకోర్టు భవనాల వద్ద రూ.547 కోట్లతో మౌలిక సదుపాయాలు కల్పించే పనులు చేపట్టాలని నిర్ణయించారు. అదనంగా, అమరావతికి సొంత అగ్నిమాపక విభాగం మరియు బిల్డింగ్ ట్రైబ్యునల్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఇదే సమయంలో 9 జిల్లాలను కలుపుతూ అమరావతి ఎకనామిక్ రీజియన్ అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించడం జరుగుతోంది.

📰 AIMA MEDIA REPORTER
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010

16
1633 views

Comment