తెలంగాణలో బాల్యవివాహాలు, గృహహింస అత్యధికం
తెలంగాణ (AIMA MEDIA ): జాతీయ 'నమూనా రిజిస్ట్రేషన్ వ్యవస్థ' (SRS) మరియు జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (NFHS-6) తాజా నివేదికల ప్రకారం, దేశంలో అసాంక్రమిక వ్యాధుల వల్ల 60 శాతానికి పైగా మరణాలు జరుగుతున్నాయి. 32.1 శాతం మరణాలు గుండె జబ్బుల కారణంగా సంభవిస్తున్నాయి. ఊబకాయం, మధుమేహం కేసులు తీవ్రంగా పెరిగి, పురుషుల్లో 20.9 శాతం, మహిళల్లో 17.8 శాతం మధుమేహం కేసులు ఉన్నట్లు తెలిపింది. 15-29 ఏళ్ల యువతలో ఆత్మహత్యల మరణాలు 19 శాతానికి పెరిగాయి.
ఈ సర్వేలో మహిళల సామాజిక-ఆర్థిక పరిస్థితులపై వివరాలు కూడా ఉన్నాయి. మహిళల ఇంటర్నెట్ వినియోగం 33.3 శాతం నుండి 64.3 శాతానికి పెరిగింది. కేరళలో 87.3 శాతం మహిళలు ఇంటర్నెట్ వాడుతున్నారని, తెలంగాణలో 64.8 శాతం, ఆంధ్రప్రదేశ్‌లో 63.6 శాతం మహిళలు ఉన్నారని తెలుస్తోంది. దాదాపు 89 శాతం మహిళలకు వ్యక్తిగత బ్యాంకు ఖాతాలు ఉన్నాయి.
అయితే, బాల్యవివాహాలు, గృహహింస వంటి సమస్యలు దేశంలో ఇంకా కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా 20 శాతం బాల్య వివాహాలు జరుగుతున్నాయి. 22.3 శాతం మహిళలు భర్తల నుంచి గృహహింసను ఎదుర్కొంటున్నారు. దక్షిణాది రాష్ట్రాల్లో తెలంగాణలో 30.8 శాతం మహిళలు గృహహింస బాధితులుగా ఉన్నట్లు సర్వే తెలిపింది.
📰 AIMA MEDIA STAFF
🎙️ Social Media Activist
👤 Prakash
📱 9000250010