గ్రామాల్లో పర్యటించిన మల్కాజ్గిరి బిజెపి ఎంపీ.
హైదరాబాద్ : దుండిగల్ సర్కిల్ పరిధిలోని తండా-2, గాగిలాపూర్-214, నాగులూరు గ్రామాల్లో పర్యటించిన ఎంపీ ఈటల రాజేందర్.
ప్రజల నుంచి నేరుగా వినతులు స్వీకరించి స్థానిక సమస్యలను పరిశీలించిన ఎంపీ ఈటల రాజేందర్.
తండా-2లో అంగన్వాడీ కేంద్రాన్ని తిరిగి ఏర్పాటు చేయాలని గ్రామస్తుల విజ్ఞప్తి.
డ్రైనేజీ పనుల అనంతరం రోడ్ల నిర్మాణం పూర్తి చేయాలని డిమాండ్.
హైవే నుంచి తండాకు స్ట్రీట్ లైట్లు ఏర్పాటు చేయాలని కోరిన ప్రజలు.
రాంకీ సంస్థ కాలుష్యం, డంపింగ్ యార్డు సమస్యలపై ఆందోళన వ్యక్తం చేసిన గ్రామస్తులు.
తండాలో బస్తీ దవాఖానా, రేషన్ షాపు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి.
గాగిలాపూర్లో మంచినీటి సమస్య, ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుపై ప్రజల వినతి.
నాగులూరులో ఆర్టీసీ బస్సు సౌకర్యం లేక ప్రజలు పడుతున్న ఇబ్బందులను వివరించిన స్థానికులు.
అధ్వాన్న రోడ్లు, రేషన్ షాపు లేకపోవడం, స్ట్రీట్ లైట్ల సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకెళ్లిన గ్రామస్తులు.
స్మశానవాటికకు సరైన మార్గం, నివాస స్థలాల కోసం భూమి కేటాయించాలని విజ్ఞప్తి.
పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతపై ఆవేదన వ్యక్తం చేసిన గ్రామ ప్రజలు.
అన్ని సమస్యలను క్షుణ్ణంగా పరిశీలించిన ఎంపీ ఈటల రాజేందర్.
సమస్యల పరిష్కారం కోసం అధికారులతో మాట్లాడి చర్యలు తీసుకుంటామని హామీ.
వారం రోజుల్లో తిరిగి గ్రామాలను సందర్శిస్తానని ఎంపీ ఈటల రాజేందర్ భరోసా.