logo

రాజీవ్ యువ వికాసం అర్హుల జాబితా రూపొందించాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

రాజీవ్ యువ వికాసం దరఖాస్తులను పరిశీలించి అర్హుల జాబితా రూపొందించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. మంగళవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరంలో రాజీవ్ వికాసం దరఖాస్తుల పరిశీలన మార్గదర్శకాలపై సంబంధిత శాఖల అధికారులు, బ్యాంకు మేనేజర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కల్పించే దిశగా ప్రభుత్వం చేపట్టిన రాజీవ్ యువ వికాసం పథకంలో వచ్చిన దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి జాబితా రూపొందించే విధంగా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారుల ఆధ్వర్యంలో ఎంపీడీవోలు, బ్యాంకు మేనేజర్లు కమిటీ సభ్యులు తమ మండలాల్లోని కార్యాచరణ రూపొందించుకొని ప్రతి దరఖాస్తును క్షేత్రస్థాయిలో పరిశీలించి అర్హులైన వారి జాబితా రూపొందించాలన్నారు. క్షేత్రస్థాయిలో దరఖాస్తుల పరిశీలన పారదర్శకంగా జరగాలని అనంతరం జిల్లా స్థాయి కమిటీకి జాబితాలో అందించాలని ఆదేశించారు. బ్యాంకర్లు సమన్వయంతో ఆధార్ కార్డు, రేషన్ కార్డు, ఆదాయ ధ్రువీకరణ పత్రం, శాశ్వత డ్రైవింగ్ లైసెన్స్, పట్టాదారు పుస్తకం, సదరం సర్టిఫికెట్ మరియు ఇతర దృవీకరణ పత్రాలను క్షుణ్ణంగా పరిశీలించాలని తెలిపారు. జనాభా ప్రాతిపదిక కలిగిన యూనిట్ల కేటాయింపు ఉంటుందని, ఓకే గ్రామంలో ఒక యూనిట్కు ఎక్కువ మంది దరఖాస్తులు చేసుకుంటే వాటిని పరిశీలించాలని, ఆయా కార్పొరేషన్ల అధికారులు దరఖాస్తుల పరిశీలన ప్రక్రియలో పాల్గొనాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. వ్యవసాయ సంబంధిత యూనిట్ల స్థాపనకు ప్రజలకు అవగాహన కల్పించాలని, చేపల పెంపకం యూనిట్లను ఈ పథకం ద్వారా స్థాపించడం ద్వారా వారి యొక్క ఆర్థిక పురోగతి ఉంటుందని కలెక్టర్ తెలిపారు. అదేవిధంగా పాడి పరిశ్రమలు స్థాపనకు ప్రోత్సహించాలని ఆయన సూచించారు. యువ వికాసం అమలకు బ్యాంకర్లు సహకరించాలని కలెక్టర్ కోరారు.

ఈ సమావేశంలో సిపిఓ సంజీవరావు, బీసీ సంక్షేమ అధికారి ఇందిరా, మహిళా శిశు సంక్షేమ అధికారి స్వర్ణలత లెనినా, లీడ్ బ్యాంకు మేనేజర్ రామ్ రెడ్డి, సంబంధిత శాఖల అధికారులు మరియు బ్యాంకుల అధికారులు పాల్గొన్నారు.

19
831 views