
మహిళలను కించపరిచినట్టు మాట్లాడితే ఇకమీదట ఊరుకునేదే లేదు:ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు మరియు మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ కంచర్ల జమలయ్య
శుక్రవారం 13వ తారీకున రామవరం vma గ్రౌండ్ నందు ప్రైవేట్ బ్యాంకులు వారు ఇబ్బంది పెడుతున్న మహిళా సోదరీమణుల సమావేశం రామవరంలో ఏడువార్డులు పరిధిలో ఉన్న మహిళలని ఇబ్బంది పెడుతున్న బందన బ్యాంక్ షేర్ముల బ్యాంక్ అన్నపూర్ణ బ్యాంక్ బిఆర్ఎల్ బ్యాంక్ డబల్ ఎక్స్ ఎల్ బ్యాంక్
యూనిటీ బ్యాంక్ తిరుమల బ్యాంక్ లు వారు వారాల లోన్లు ఇచ్చి మహిళలని లోన్లు వసూలు చేసే క్రమంలో మహిళలని చూడకుండా ఇష్టం వచ్చినట్లు బూతులు తిడుతూ వీడియోలు తీస్తూ అసభ్యకర పదజాలాలతో దూషిస్తున్న ఈ బ్యాంకులపై చర్యలు తీసుకోవాలని గౌరవ జిల్లా కలెక్టర్ గారిని ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు మరియు మున్సిపల్ మాజీ ఫ్లోర్ లీడర్ కంచర్ల జమలయ్య గౌరవ జిల్లా కలెక్టర్ గారికి విజ్ఞప్తి చేశారు లోన్లు పేరుతో మొదటి గానే ఇన్సూరెన్స్ పేరుతో 3000
కమిషన్ పేరుతో 2000 వసూలు చేస్తూ ఇబ్బందులు పెడుతున్న ఈ ప్రైవేటు బ్యాంకులపై తెలంగాణ రాష్ట్రం ప్రభుత్వం ఉక్కు పాద మోపాలని ప్రభుత్వాన్ని కోరారు మహిళల పట్ల సభ్యంగా ప్రవర్తిస్తే ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ శాఖ వారిని కోరారు వారు పెట్టే ఇబ్బందులు తాళ్ళ లేక ఈ మధ్యకాలంలోనే ఒక మహిళ ఉరి వేసుకున్న సంగతి మరవకముందే ఈ ప్రవెటు బ్యాంకుల రికవరీ చేసే గుమస్తాలు ఆగడాలు అరికట్టాలని ప్రభుత్వాన్ని కోరారు ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ ఫ్లోర్ లీడర్ మునిగడప వెంకటేశ్వర్లు భూక్య శ్రీనివాస్ కనుకుంట్ల శ్రీనివాస్
సనపవీరభద్రం మహిళా సమైక్య నాయకురాలు ధార లక్ష్మి అన్నపూర్ణ సుభద్ర సుగుణ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు