logo
Select Language
Hindi
Bengali
Tamil
Telugu
Marathi
Gujarati
Kannada
Malayalam
Punjabi
Urdu
Oriya

ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నూతన సంవత్సరం 1 వతరగతి నుండి 10 వ తరగతి పిల్లల కు తల్లికి వందనం పథకం కింద కుటుంబం లోని బడికి వెళ్ళే ప్రతి విద్యార్థికి 13000 వేలు రూపాయిలు చొప్పున ఎంత మంది విద్యార్థులు ఉంటే అంతమందికి తల్లికి వందనం పథకం ద్వారా తల్లుల ఖాతాలలో డబ్బులు జమ కావడంతో అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు

నగరి చిత్తూరు జిల్లా [15-06-2025 ]
*కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో సూపర్ 6 పథకాలలో ఒక్కొక్కటి నెరవేరుస్తూ వస్తుంది
*తల్లికి వందనం పథకం కింద కుటుంబం లోని ఎంత మంది విద్యార్థులు ఉంటే అంత మందికి ఈ పథకం ద్వారా 13000 వేలు రూపాయిలు పిల్లల తల్లుల ఖాతాలలో డబ్బులు జమ కావడం జరిగింది
*తల్లికి వందనం పథకం ను వాట్స్ అప్ లో మనమిత్రలో 9552300009 ద్వారా చెక్ చేసుకోవచ్చు
*తల్లికి వందనం పథకం ద్వారా ప్రతి విద్యార్థికి ఏటా 15000 రూపాయిలు ఇందుకోసం బడ్జెట్ లో8,745 కోట్లు కేటాయింపు రాష్ట్ర ప్రభుత్వం చేసింది రాష్ట్ర వ్యాప్తంగా67.27 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారు
*సూపర్ 6 ఫ్యామిలీ ఆరుగురికి తల్లికి వందనం పథకం ద్వారా లబ్ధి చేకూరింది బెలుగుప్పా మండలంలో అంకం పల్లెలో నిరుపేద కుటుంబం గంగమ్మ ఓబులేసు దంపతులకు వీరికి ఆరుగురు పిల్లలు వీరికి78 వేలు రూపాయిలు తల్లికి వందనం పథకం కింద లబ్ధి చేకూరింది వీరు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కి కృతజ్ఞతలు చెపుతూ కుటుంబం సంతోషాన్ని వ్యక్తం చేశారు గత ప్రభుత్వంలో ఒక్కరికీ మాత్రమే అమ్మ ఒడి అందింది అని అన్నారు
*మాజీ ముఖ్యమంత్రి జగన్ ఇలాకా అయిన పులివెందుల నియోజక వర్గం కుచెందిన వేంపల్లి మండలంలో బక్కన్న గారి పల్లెలో ఓకె కుటుంబంలో 5 గురి పిల్లలకు తల్లికి వందనం పథకం కింద లబ్ధి పొందారు వారు సంతోషాన్ని వ్యక్తం చేశారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి కి కృతజ్ఞతలు తెలిపారు
*కలకడ లోని ఒక ఉమ్మడి కుటుంబం లో 12 మందికి తల్లికి వందనం పధకం కింద1 లక్షా 56 వేలు రూపాయిలు ఆ తల్లుల ఖాతాలలో డబ్బులు జమ కావడంతో అందరూ హర్షం వ్యక్తం చేశారు
*ఇందులో భాగంగా కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో చేసిన కార్యక్రమాలు అమలు చేసిన పథకాలు ను గ్రామాలలో ప్రతి ఇంటి గడపకు వెళ్ళి వివరిస్తామని వెల్లడించారు
*నూతన విద్యా సంవ్సరానికి ప్రభుత్వ బడులలోని పిల్లలు అందరికి ఉచిత పుస్తకాలు, నోట్ బుక్స్, కొత్త యూనిఫాం, టై నాణ్యత కలిగిన వి అందిస్తున్నారు

151
10719 views

Comment