logo

అనధికారిక లే ఔట్ లు తొలగించాలి : : నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి మ్యూనిసిపల్ స్థలాలను రక్షించాలి.

అనధికారిక లే ఔట్ లు తొలగించాలి : : నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి

మ్యూనిసిపల్ స్థలాలను రక్షించాలి.

▪️వివిధ సామాజిక మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించండి...

▪️టౌన్ ప్లానింగ్ అధికారులతో సమావేశం....
GWMC 09 జూలై 2025 :

బల్దియా పరిధి లోని అనధికారిక లే ఔట్ లను గుర్తించి తొలగించుటకు చర్యలు తీసుకోవాలని నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు.

బుధవారం బల్దియా ప్రధాన కార్యాలయం లోని మేయర్ చాంబర్ లో టౌన్ ప్లానింగ్ అధికారులతో జరిగిన సమావేశంలో మేయర్ సమర్థవంతంగా నిర్వహించుటకు అధికారులకు పలు సూచనలు చేశారు.


ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ
నగరంలో అనధికారిక లే ఔట్ లు ప్లాట్ లను కొనుగోలు. చేయకూడదని వీటి పట్ల ప్రజల్లో చైతన్యం కలిగించడానికి టౌన్ ప్లానింగ్ విభాగం వివిధ సామాజిక మాధ్యమాలు కరపత్రాలు ఫ్లెక్సీ ల ద్వారా అవగాహన కలిగించాలని మేయర్ అధికారులను ఆదేశించారు
మున్సిపాలిటీ కి చెందిన ఓపెన్ ప్లాట్లు కాంపౌండ్ వాల్ లేని మున్సిపల్ స్థలాలు పార్కు లు బల్దియా కు చెందిన ప్రాపర్టీలని సూచించే విధంగా బోర్డు లు ఏర్పాటు చేయాలని, గ్రీన్ ఏరియా కు సంబంధించిన ప్రాపర్టీ ని ఫెన్సింగ్ ఏర్పాటు చేసి రక్షించాలని, బల్దియా వ్యాప్తంగా క్షేత్ర స్థాయి లో టౌన్ ప్లానింగ్ అధికారులు, సిబ్బంది అనధికార లేఅవుట్ లు, ముందస్తుగా గుర్తించాలని, వర్షాకాలం నేపద్యం లో నగర వ్యాప్తం గా ఉన్న శిథిలావస్థలో ఉన్న ఇళ్లను గుర్తించి వారికి నోటీసులు అందించి ప్రాణ, ధన నష్టం కలుగ కుండా ఖాళీ చేయించాలని, అపార్ట్మెంట్ లలో గల సెల్లార్ ప్రాంతాల్లో విద్యుత్ ఉపకరణాలు లేకుండా చూడాలని ఈ సందర్భం గా మేయర్ అధికారులకు సూచించారు.

ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్ డిప్యూటీ కమిషనర్ రవీందర్ అసిస్టెంట్ సిటీ ప్లానర్లు శ్రీనివాస్ రెడ్డి రజిత యెర్షాద్ ప్రశాంత్ తోపాటు టిపిఎస్ లు టి పి బి ఓ లు తదితరులు పాల్గొన్నారు

28
489 views