
యువతకు ఏం నేర్పిస్తున్న యో అర్థం కాకపోతున్న సామాజిక మాధ్యమాలు.....
టెక్నాలజీ మీద బతుకుతున్న యువత
ఏ ఐ టెక్నాలజీ యువతను చెడగొడుతుందా......
అవునంటున్న విశ్లేషకవర్గాలు మంచి మంచి చదువులు చదువుకొని అమ్మా నాన్నకు మద్దతుగా తోడ్పాటును ఇచ్చే మంచి కొడుకుగా కూతురుగా అల్లుడుగా ఉండవలసిన యువత ఈరోజు అడ్డదారు తొక్కుతూ ఉచిత డబ్బుల కోసం సోషల్ మీడియాను ఒక అడ్డంగా పెట్టుకొని డబ్బులు సంపాదిస్తున్నారు యువత కొంతమంది యూట్యూబ్ ఛానల్ వారు యువతకు ఏం సందేశం ఇస్తున్నారని అర్థం కావడం లేదు అంతా దురుసు ప్రవర్తన దుర్భాషలాడే భాష సోషల్ మీడియా వల్ల ఎంత లాభ పడుతున్నారు అన్నది పక్కన పెడితే ఏడవ తరగతి చదువుతున్న విద్యార్థి కాడ నుంచి పై స్థాయి ఉన్న యువత వరకు అంతా అనర్థమే చూసేది అంత అసలీలతా చేసేవి అంతా వ్యంగాసనాలు గంజాయి మందు ఇతర వ్యసనాలకు అలవాటై యువత అడ్డదారులు తొక్కుతూ యూట్యూబ్ మరియు టెలిగ్రామ్ యాప్ ల ద్వారా అప్పులపాలై వీడియో గేమ్ లలో ఓడిపోయి లోన్ యాప్ ల ద్వారా అప్పులు చేసి ఇప్పటికే చాలామంది యువత ఆత్మహత్య చేసుకొని చనిపోయిన సంఘటనలను మనం చూస్తున్నాం. ఇకమీదట వచ్చే టెక్నాలజీ యువతకు మంచి జరుగుతుందన్న నమ్మకం రాను రాను పోతుంది ఇప్పుడు కొత్తగా వచ్చిన ఏఐ "టెక్నాలజీ సమాజాన్ని మించిన అంశంగా మారింది "ఏ ఐ "టెక్నాలజీని మంచికే ఉపయోగించాలో చెడుకు ఉపయోగించాలో యువతకు తెలిసి తెలియక టెక్నాలజీని ఉపయోగిస్తూ కొంతమంది జీవితాలను కూడా ఆడుకున్న సంఘటన ఈ మధ్యకాలంలో చూస్తున్నాం సామాజిక మాధ్యమాలలో వచ్చే యూట్యూబ్ స్టార్ అని కొంతమంది వ్యక్తులు కూడా యువతకు ఏ సందేశం ఇస్తున్నారు తెలియదు . ఎవరిదో డబ్బు ఎవరో ఆనందపడుతూ ఉంటారు ఈ విషయం సాధారణ ప్రజలకు తెలవక ఇంట్లో తల్లిదండ్రులను ఇబ్బంది పెడుతూ ఆఖరికి తల్లి తండ్రి అడిగిన కోరిక నెరవేర్చినందుకు అభం శుభం తెలియని చిన్నపిల్లలు కూడా ప్రాణాలు తీసుకుంటున్న సంఘటన ఈ మధ్యకాలంలో ఎన్నో చూశాము సామాజిక మాధ్యమాలలో చూసేటి అన్ని నిజం కాదు . ఎవరో ఏదో చేశారని మనం కూడా అవి చేయాలి అని అనుకోవడం పొరపాటు ఎవరి కుటుంబా ఆర్థిక లాభాలు వాళ్లకు తెలుసు కానీ అతి ఆశకు పోయి తల్లిదండ్రులను ఇబ్బంది పెట్టి పిల్లలు ఆనందపడటం సరైనది కాదు దయచేసి ఇప్పటికైనా యువత మారాలి చదువు మీద దృష్టి పెట్టి ఇంకా ఎన్నో శిఖరాగ్రాలను ఎక్కి విజయం సాధించాలని డ్రగ్ గంజాయి మద్యాలకు దూరంగా ఉండి సమాజానికి మంచి విలువిస్తూ తల్లితండ్రులకు మంచి గుర్తింపునిస్తూ జీవనాన్ని కొనసాగించాలని మా కోరిక టెక్నాలజీని మంచికే ఉపయోగించాలి చెడుకు కాదు.