logo

*చినుకు పడితే బస్సు ఎక్కాలేము దిగాలేము* *కొద్దిపాటి వర్షాలకు సైతం బస్టాండ్ ఆవరణలోకి వర్షపునీరు చేరి ప్రయాణికుల సమస్యలు వర్ణాతీతం* *చెయ్యి ఎత్తితే చాలు ఎక్కడబడితే అక్కడ బస్సు ఆపుతాం అని బస్సులో ఉండే స్లోగం రాతలకే పరిమితం* *ఆఫీసులకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్థులు, ప్రయాణికులకు మాత్రం తప్పని తిప్పలు* *వార్త కథనాలకు సైతం స్పందన లేని ఆర్టీసీ* *రేపే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ పథకం అమలు* *కానీ బస్టాండుల్లో మహిళల ఇబ్బందులు పట్టించుకునే నాధుడు ఎవరు?*

ఎన్టీఆర్ జిల్లా కంచికచర్ల ప్రతినిధి, ఆగస్టు14 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)

నందిగామ,కంచికచర్ల పట్టణం లలో ఉన్న (ఏపీఎస్ఆర్టీసీ) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ బస్టాండ్ ఆవరణలోకి వర్షపు నీరు చేరి ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు.
బస్టాండ్ బయట నుంచి బస్సులు తిరిగి వెళ్తున్నాయి కానీ బయట బస్సు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికుల సమస్యలు పట్టించుకునే వారే లేకపాయే. వర్ష కాలం వచ్చింది అంటే బస్టాండ్ లోపలికి వెళ్ళే పరిస్థితులు కనిపించదు.
కంచికచర్ల బస్టాండ్ నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రవాణా సంస్థ కు ఆదాయం వస్తున్నా. బస్టాండ్ మరమ్మతులు చేసే ఆలోచనలు చేయటం లేదు ఏపీఎస్ఆర్టీసీ అధికారులకు.

0
46 views