logo

17, 18 వార్డులలో లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్

ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రతినిధి, ఆగస్టు 14 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)

ప్రభుత్వ విప్, స్థానిక శాసన సభ్యురాలు తంగిరాల సౌమ్య ఆదేశానుసారం పట్టణ పరిధి లోని 17, 18 వార్డులలో లోతట్టు ప్రాంతాలను కూటమి నేతలతో కలిసి పరిశీలించిన మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణ కుమారి నిన్న సాయంత్రం నుండి కురుస్తున్న అతి భారీ వర్షాల కారణంగా 18 వ వార్డులోని రామన్నపేట రోడ్డు ప్రధాన రహదారిపై రాకపోకలకు అంతరాయం కలిగింది పరిస్థితిని తెలుసుకున్న మున్సిపల్ చైర్ పర్సన్ కూటమి నేతల సహకారంతో ప్రజలను అప్రమత్తం చేస్తూ సురక్షిత ప్రాంతాలకు తరలించారు. అనంతరం లోతట్టు ప్రాంతాలను పర్యవేక్షించారు. ఈ కార్యక్ర మంలో పట్టణ పార్టీ అధ్యక్షులు ఏచూరి రాము, 17 వ వార్డు కౌన్సిలర్ బాపట్ల సాంబయ్య,18 వ వార్డు కౌన్సిలర్ బండారు గంగమ్మ, శేషు, తెదేపా నాయకులు కొమరగిరి సత్యనారాయణ, ఇస్మాయిల్, జిలాని తదితరులు పాల్గొన్నారు.

0
12 views