*జగ్గయ్యపేట పట్టణంలో వర్ష ప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)*
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట ప్రతినిధి, ఆగస్టు14 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)
గత మూడు రోజులుగా కురు స్తున్న భారీ వర్షాల ప్రభావంతో జగ్గయ్యపేట పట్టణంలోని వైవై కాలనీ, ఆర్టీసీ కాలనీ, దుర్గాపురం, చెరువు అలుగు, రైల్వే ట్రాక్ వద్ద రోడ్డు కోతకు గురైన ప్రాంతాలను జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య స్వయంగా సందర్శించారు.
ఈ సందర్భంగా మున్సిపల్ అధికారులు, ఇరిగేషన్ అధికారులతో కలిసి నష్టపోయిన ప్రతి ప్రాంతాన్ని పరిశీలించి, సమస్యల పరిష్కారం కోసం అక్కడికక్కడే తగిన ఆదేశాలు జారీ చేశారు.
ఎమ్మెల్యే సంబంధిత అధికారు లకు శాశ్వత ప్రాతిపదికన మరమ్మత్తు పనులను తక్షణమే ప్రారంభించి, త్వరితగతిన పూర్తి చేయాలని సూచించారు. వర్షాల వల్ల ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని విభాగాలు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు.