*సొసైటీ ప్రెసిడెంట్ గా ఎన్నికైన రహమతుల్లాకు శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే సౌమ్య*
ఎన్టీఆర్ జిల్లా నందిగామ ప్రతినిధి, ఆగస్టు14 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)
నందిగామ పట్టణం కాకాని నగర్ ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య కార్యాలయం నందు వీరులపాడు మండలం జుజ్జూరు గ్రామ సొసైటీ ప్రెసిడెంట్ గా జనసేన పార్టీ నుండి ఎన్నిక కాబడిన షేక్ రహంతుల్లా కూటమి నేతలతో కలిసి ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్యని వారి కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలవడం జరిగినది. ఈ సందర్భంగా నూతన సొసైటీ ప్రెసిడెంట్ గా ఎన్నిక కాబడిన రహమతుల్లాకు తంగిరాల సౌమ్య శుభాకాంక్షలు తెలియజేశారు.