అన్నమయ్య జిల్లా మదనపల్లె పట్టణం పుర పాలకసంఘం లో జరిగిన కౌన్సిల్ సమావేశం లోపనుల కేటాయింపు పై వివక్ష ఎందుకని ప్రశ్నిస్తున్న కౌన్సిలర్ షేక్ కరీముల్లా
కౌన్సిలర్ షేక్ కరీముల్లా మాట్లాడుతూ పన్నులు మాత్రం అన్ని వార్డులనుంచి వసూలు చేస్తూ కొన్ని వార్డులకు మాత్రమే పనులు కేటాయించడం ఎంతవరకు సబబని,ప్రజలకు జవాబుదారీగా ఉండాల్సిన కౌన్సిల్ బాధ్యతను మరిచి కొందరి ఆర్థిక ప్రయోజనాలకోసం తీర్మానాలు చేయడం,వాయిదాలు వేయడం సరికాదని ప్రజలే బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని,ఇప్పటికైనా పద్ధతులు మార్చుకుంటే మంచిదని సూచించారు.