logo

ఎన్టీఆర్ జిల్లాలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు చిత్రపటాలకి పాలాభిషేకం

ఎన్టీఆర్ జిల్లా విజయవాడ, అక్టోబర్4: (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)

ఆటో డ్రైవర్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన “ఆటో డ్రైవర్ల సేవలో” పథకం ప్రారంభాన్ని పురస్కరించుకొని ఎన్టీఆర్ జిల్లా జనసేన పార్టీ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు విజయవాడ సింగ్‌నగర్‌లో ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా అధ్యక్షులు సామినేని ఉదయభాను హాజరై మాట్లాడుతూ, “రాష్ట్ర ఖజానా ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్నప్ప టికీ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ సహకారంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరియు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో కూటమి ప్రభుత్వం ప్రజాసంక్షేమానికి కట్టుబడి పని చేస్తోంది. ఎన్నికల ముందు ప్రకటించిన ‘సూపర్ సిక్స్’ పథకాలు వేగంగా అమలవుతున్నాయి,” అని పేర్కొన్నారు. ప్రత్యేకంగా "ఆటో డ్రైవర్ల సేవలో" పథకం కింద, గత ప్రభుత్వంతో పోలిస్తే 50% అధికంగా రూ.15,000/- ఆటో డ్రైవర్ల ఖాతాల్లో జమ చేయడం జరిగిందని ఆయన తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయవాడ నగర జనసేన నాయకులు, కార్యకర్తలు, వీరమహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కూటమి పట్ల ప్రజల్లో విశ్వాసం పెరుగుతోందని కార్యకర్తలు భావిస్తున్నారు.

0
34 views