logo

ఆటో డ్రైవర్ల సేవ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) పాల్గొన్నారు

ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట, అక్టోబర్ 4: (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)

జగ్గయ్యపేట పట్టణంలోని స్థానిక మార్కెట్ యార్డ్‌లో ఆటో డ్రైవర్ల సేవ కార్యక్రమం శుభ్రంగా, అంగరంగ వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జగ్గయ్యపేట నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) హాజరయ్యారు. విశిష్ట అతిథిగా మున్సిపల్ చైర్మన్ రంగాపురం రాఘవేంద్ర పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఎమ్మెల్యే పేర్కొన్నారు: "ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం పట్ల నిబద్ధతతో పనిచేస్తోంది. ఆటో డ్రైవర్ల సేవ కార్యక్రమం దానికి నిదర్శనం. ఎండ, వాన లెక్కచేయకుండా పనిచేస్తూ తమ కుటుంబాలను పోషిస్తున్న ఆటో డ్రైవర్లకు ప్రభుత్వ మద్దతు అత్యవసరం. ఈరోజు రాష్ట్రవ్యాప్తంగా రూ. 436 కోట్లు డ్రైవర్ మిత్రులకు ప్రభుత్వం చెల్లించింది.
జగ్గయ్యపేట నియోజకవర్గానికి చెందిన 2002 మందికి, మొత్తం రూ. 3.30 కోట్ల లబ్ధిచేకూరింది."
అలాగే, సూపర్ సిక్స్ పథకాల ప్రయోజనాలు ప్రజలకు చేరాయని, రాబోయే రోజుల్లో మరిన్ని సంక్షేమ పథకాలు రాష్ట్ర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యమని ఎమ్మెల్యే చెప్పారు. అమరావతి అభివృద్ధిపై మాట్లాడుతు, "ముఖ్యమంత్రి నారాచంద్రబాబు నాయుడు అమరావతిని తిరిగి అభివృద్ధి మార్గంలో నడిపిస్తున్నారు. టెండర్లు పిలిచి పనులు వేగంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర ప్రజలు ఇతర రాష్ట్రాలకు వెళ్లకుండానే, అమరావతిలోనే ఉద్యోగావకాశాలు పొందే విధంగా సీఎం కృషిచేస్తున్నారు," అని తెలిపారు. ఈ కార్యక్రమం లో మున్సిపల్ కౌన్సిలర్లు, కూటమి నాయకులు, మండల స్థాయి నాయకులు, మున్సిపల్ అధికారులు, సచివాలయ సిబ్బంది మరియు పెద్ద సంఖ్యలో ప్రజలు పాల్గొన్నారు.

0
46 views