*అయ్యప్ప పడిపూజాకార్యక్రమం ఘనంగా*
*లింగాలపాడు గ్రామంలో భక్తుల ఉత్సాహం*
ఎన్టీఆర్ జిల్లా, నందిగామ నవంబర్ 22 (ఏ ఐ ఎమ్ ఏ న్యూస్)
నందిగామ మండలం లింగాల పాడు గ్రామంలో శుక్రవారం జరిగిన అయ్యప్ప పడిపూజా కార్యక్రమం భక్తులతో కళకళ లాడింది. గ్రామంలోని శ్రీ లక్ష్మీ పేరంటాల అమ్మవారి దేవస్థానం ప్రాంగణంలో, వైఎస్సార్సీపీ నాయకులు పారుపల్లి హరిబాబు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వందలాది మంది అయ్యప్ప మాలధారులు పాల్గొని భజనలతో భక్తిరసాన్ని పంచారు. ముఖ్య అతిథిగా హాజరైన నందిగామ మాజీ శాసన సభ్యులు డాక్టర్ మొండితోక జగన్మోహనరావు పూజల్లో పాల్గొని,తీర్థప్రసాదాలు స్వీకరించారు. అయ్యప్పస్వామి కటాక్షం సర్వభక్తులపైనిలవాలని కోరుకున్నారు. దీక్షా స్వాములు నియమనిష్టలతో చేసే పూజలు ఫలించాలని ఆయన అయ్యప్పను వేడుకున్నారు.
అయ్యప్ప మాలధారులను భక్తిపరవశంలో ముంచెత్తుతూ గజ్జల శ్రీను స్వామి అందించిన భజనపాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. గ్రామ నాయకులు పారుపల్లి హరిబాబు మరియు అయ్యప్ప పీఠం స్వాములు ఈ కార్యక్రమాన్ని అత్యంత శ్రద్ధగా నిర్వహించారు. కార్యక్రమం కన్నులపండువగా సాగింది.